'ఎగ్జుమా' .. హారర్ జోనర్లో రూపొందిన కొరియన్ సినిమా. క్రితం ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. జాంగ్ జే హ్యూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చోయ్ మిన్ - సిక్, కిమ్ గో ఇయున్ .. యు హే జిన్ .. లీదో హ్యూన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. కథ: పార్క్ జీ యోంగ్ కొరియాకు చెందిన యువకుడు. అతను తన కుటుంబంతో కలిసి అమెరికాలో నివసిస్తూ ఉంటాడు. అతని భార్య ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన దగ్గర నుంచి ఆ పిల్లాడు ఏడుస్తూనే ఉంటాడు .. అందుకుగల కారణం ఏమిటనేది డాక్టర్లు చెప్పకపోవడంతో, అతీంద్రియ శక్తుల విషయంలో అనుభవం ఉన్న లీ హారీమ్ (కిమ్ జో ఎన్) బోంగిల్ (లీ డ్యూ హ్యాన్)ను కొరియా నుంచి పిలిపిస్తాడు. పార్క్ కొడుకును ఆ ఇద్దరూ పరిశీలనగా చూస్తారు. పార్క్ తాత ప్రేతాత్మ ఆ కుటుంబంపై కోపంతో ఉందనీ, అతని కారణంగానే ఆ పిల్లాడు చికాకు చేస్తున్నాడని వాళ్లు చెబుతారు. పార్క్ తాత శవాన్ని పూడ్చిన చోటు మంచిది కాదనీ, అక్కడి నుంచి దానిని వెలికితీసి మరో ప్రదేశంలో పూడ్చడం వలన ఆ ప్రేతాత్మ శాంతిస్తుందని చెబుతారు. ఈ విషయంలో అనుభవం ఉన్న 'కిమ్' (చోయ్ మిన్ సిక్), తన సహచరుడైన 'కో'తో కలిసి వాళ్లకి సహకరించడానికి ముందుకు వస్తాడు.నలుగురూ కలిసి అడవిలోని ఒక కొండపై గల పార్క్ తాత సమాధిని తవ్వుతారు. అయితే వర్షం కారణంగా ఆ శవపేటికను మరో చోటుకు తరలించలేకపోతారు. ఆ శవపేటికలో నిధి ఉండొచ్చని ఒక వ్యక్తి దానిని తెరవడానికి ప్రయత్నించగా, అందులోని ప్రేతాత్మ బయటికి వస్తుంది. కొంతమందిపై ప్రతీకారం తీర్చుకునే దిశగా అది ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అదే సమాధిలో నుంచి మరో శవపేటిక బయటపడుతుంది. ఆ శవపేటిక ఎవరిది? దానిని వెలికితీయడం వలన చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa