ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 17న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ‘ఎమర్జెన్సీ’

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:22 PM

కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం మిశ్రమ స్పందనతో సరిపెట్టుకుంది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని కంగనా తాజాగా ప్రకటించారు. ఇన్‌స్టా వేదికగా ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మార్చి 17 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎమర్జెన్సీ చిత్రాన్ని రూపొందించారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ కథ సిద్థం చేశారు. ఇందిరాగాంధీ కంగనా నటించగా.. జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa