ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున సినిమాకి డిజిటిల్ రైట్స్ ఎంతో తెలుసా ?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 04:01 PM

కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. కాగా ఈ సినిమా డిజిటిల్ రైట్స్ ను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ 7.4 కోట్లకు కొనుగోలు చేసింది. `మ‌న్మ‌థుడు 2` థియేట్రికల్ ట్రైలర్ జూలై 25న రిలీజ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.


కాగా ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa