హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని హీరోయిన్ నభా నటేష్ కి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వీరాభిమానిగా మారిపోయాడు. ఆయన నభాని పొగిడేసిన తీరుకు వోడ్కా తాగినంత కిక్కులోకి వెళ్లిపోయింది. `నభా నటేష్ ఇలియానా 2.0` అంటూ కితాబిచ్చేశాడు ఆర్జీవీ. నభాని చూడగానే ఆర్జీవీకి అంత కిక్కు ఎందుకు ఎక్కిందో కానీ.. తనలో అంత పెర్ఫామర్ ని చూశారా.. లేక గ్లామర్ యాంగిల్ లో తనను అంతగా పొగిడేశారా.. అన్నది ఆయనే చెప్పాలి. ఆర్జీవీ పొగడ్తకు నభా ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. ఆయన సినిమాలకు తాను వీరాభిమానిని అంటూ సంతోషాన్ని పట్టలేకపోయిన నభా ప్రత్యేకించి థాంక్స్ చెప్పింది. ప్రశంసలతోనే ఆర్జీవీ ఆల్మోస్ట్ మునగ చెట్టెక్కినంత పని చేశారు. అందుకు తగ్గట్టే తనకు ఇండస్ట్రీ టాప్ బ్యానర్లలో అవకాశాలు దక్కనున్నాయేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa