ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగస్ట్ 9 న అనసూయ “కథనం”

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 12:03 PM

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’.. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌,  పతాకాలపై  బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా  సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి రోషన్ సాలూరి  సంగీతం సమకూరుస్తుండగా, స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..  అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదలకు సిద్దమవుతోంది.


ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ…అన‌సూయ‌గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్ లొ ఇదొక  బ్లాక్ బ‌స్ట‌ర్  అవుతుంద‌ని  న‌మ్మ‌కం ఉంది.సెన్సార్ పూర్తయింది.యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9 న సినిమా విడుదల చెస్తామన్నారు.


దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ… ఇది నా మొద‌టి చిత్రం.. క్ష‌ణం, రంగ‌స్థ‌లం తర్వాత ఆమె చేస్తున్న ఈ క‌థ‌నం సినిమా తో హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారు అన‌సూయ‌గారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది..  న‌రేంద్ర‌రెడ్డిగారు పంపిణిదారునిగా  ఏ సినిమా చేసిన హిట్..  నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉందన్నారు.


 అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్ః రోషన్ సాలూరి , ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌,  రచయిత : రాజేంద్ర భరద్వాజ్, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంఃరాజేష్ నాదెండ్ల‌,






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa