దర్శకుడు త్రివిక్రమ్ తో నటుడు అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో అర్జున్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నివేదా పేతురాజ్ కనిపించనుంది. ఈ సినిమాలో ‘టబు’ కూడా ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఈ సందర్భంగా ఆమెకి స్వాగతం చెబుతూ గీతా ఆర్ట్స్ వారు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ‘హాయ్’ చెబుతూ .. తన పాత్రకి సంబంధించిన డైలాగ్స్ ను చూసుకుంటూ ‘టబు’ సంప్రదాయబద్ధమైన లుక్ తో చాలా అందంగా కనిపిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa