బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. రష్మిక మందన్న కథానాయిక. రంజాన్ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని యూనిట్ మంగళవారం విడుదల చేసింది. జోహ్రజబీన్ అంటూ సాగే ఈ గీతంలో బీట్‌కు అనుగుణంగా సల్మాన్, రష్మిక హుషారైన స్టెప్పులతో అలరించారు. ఈ పాటకు సమీర్, డానిష్ సాహిత్యం అందించగా, ప్రీతమ్ స్వరాలందించారు. నకాష్ అజీజ్, దేవ్ నేగి ఆలపించారు. సాజిద్ నడియాడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa