నటి తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ రిలేషన్‌షి్‌పలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు షికారు చేశాయి. అయితే, ఈ జంట ప్రస్తుతం విడిపోయినట్లు తెలుస్తోంది. తమ సోషల్‌మీడియా ఖాతాలలోనూ వారిద్దరూ కలసి ఉన్న ఫొటోలను తొలగించడంతో పాటు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారట. దీంతో వీరిద్దరి అనుబంధానికి బ్రేక్‌లు పడ్డాయని భావిస్తున్నారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్న వారు.. భవిష్యత్తులోనూ మంచి స్నేహితులుగా కొనసాగుదామని అనుకుంటున్నారట. కాగా, ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్‌సిరీస్ చిత్రీకరణలో తొలిసారి వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa