ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్న‌య్య‌ను క‌లిసిన త‌మ్ముడు,నాదెండ్ల

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 08:00 PM

రాజకీయాలతో తమ్ముడు పవన్ కల్యాణ్ బిజీగా ఉండగా.. ఇటు సైరా సినిమాతో మెగాస్టార్ చిరు కూడా తీరికలేనంతగా ఉన్నారు. తాజాగా.. ఆయన చేస్తున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. అక్టోబర్ 22న ఈ సినిమాను వివిధ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా.. తాజాగా.. చిరంజీవిని.. ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందులో వీరి ముగ్గురు సెల్ఫీ తీసుకున్న ఫొటో కూడా ఉంది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్.. ‘చిరంజీవి గారంటే.. మాకు ఎంతో ఇష్టం.. ఆయన జీవితమే మాకు స్ఫూర్తి అంటూ’.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa