నటుడు అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్ ద్వారా ప్రకటించింది. టబు సెట్‌లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు తీసిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే టబు విరాట పర్వం అనే మరో తెలుగు సినిమా నటించనున్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa