ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నీని కొడుకుకు ఇచ్చేసింది

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 07:16 PM

బల్లాలదేవ దగ్గుబాటి రానా గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నాడని సోషల్ మీడియాలో వినబడుతోంది. హైదరాబాద్, ముంబయిలో కిడ్నీ సమస్యకు సంబంధించి చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే రానా కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. రానా తల్లి లక్ష్మి ఆయనకు కిడ్నీ దానం చేశారు. దీంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైందని వైద్యులు తెలిపారు.  రానాకు కిడ్నీ దానం చేసేందుకు ఆయన తల్లి లక్ష్మి ముందుకు రావడంతోనే కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం రానా విశ్రాంతి తీసుకుంటున్నారు. నెల తరువాత ఆయన తాజాగా నటిస్తున్న ’విరాటపర్వం‘ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇదిలావుండగా రానాకు ఈ సమస్య ‘బాహుబలి’ షూటింగ్ సమయంలోనే తలెత్తిందట. బాహుబలిలో బల్లాలదేవ పాత్ర కోసం రానా కఠినమైన కసరత్తులు చేయడంతోనే ఆయన  శరీరంలోని సోడియం లెవెల్స్ పడిపోయానని వైద్యులు అంటున్నారు. హైదరాబాద్, ముంబయి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చూపించుకున్నప్పటికీ సమస్య నయం కాకపోవడంతో కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారమని డాక్టర్లు సూచించారట. దీంతో ఆయన యూఎస్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa