సరిగ్గా.. నాలుగేళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర సంఘటన. 144 సంవత్సరాలకోసారి వచ్చిన ముహూర్తమంటూ 2015 గోదావరి పుష్కరాల సమయంలో ప్రభుత్వ బాజా కొట్టింది. భక్తుల సెంటిమెంట్‌ను కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నంచేసింది. అప్పుడు ఏర్పడిన కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు ఏ అవకాశాన్ని జాడవిడుచుకోకూడదనే ఉద్దేశంతో పుష్కరాలను తమకు అనువుగా మలచుకునే ప్రయత్నంచేశారు. గతానికి భిన్నంగా పుష్కరాలు కొత్తగా వచ్చాయన్నట్టుగా.. విపరీతమైన ప్రచారం సాగించారు. దాని ఫలితంగా జులై 2015లో ఏపీలోని రాజమండ్రి గోదావరి నది ఒడ్డున స్నానం చేసేందుకు భారీగా జనం వచ్చారు. ఎలాగూ ప్రచారం కావాలి కాబట్టి చంద్రబాబు సీఎం హోదాలో సతీ సమేతంగా చేరారు. బోయపాటి శీనయ్య కూడా.. తన స్టయిల్లో కట్ షాట్.. చెప్పేందుకు పైగా రియలస్టిక్‌గా వచ్చేందుకు ఏదోమూలన కెమెరాలు ఫిక్స్ చేశారట. ఒకటికి రెండుసార్లు షాట్ యావలో పడి జనం వచ్చిన సంగతి మరిచారు. పైగా చంద్రబాబు వీఐపీ ఘాట్‌లను వదిలేసి సామాన్య ప్రజలు స్నానం చేసేచోటకు చేరారు. నేను మామూలు మనిషినే అనే బిల్డప్ కోసమంటూ విమర్శలూ లేకపోలేదు. అప్పటికే ఘాట్ బయట భారీగా జనం చేరారు. తొలిరోజు స్నానాలు చేసి పుణ్యం సంపాదించాలనే నమ్మకంతో వందలాది మంది గేటు వద్దకు చేరారు. అప్పటికే గేటు ముందు వరుసలో 300 మంది వరకూ నెట్టుకుంటున్నారట. బాబు గారి షూటింగ్ ముగియటంతో గేటు తెరిచారు. అంతే అక్కడ ఉన్నవారంతా ఒకేసారి లోపలకు వెళ్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. 28 మంది అక్కడికక్కడే మరణించారు. 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలామంది మహిళలు.. కుటుంబానికి దిక్కయిన మగవాళ్లు.. ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది. ఇదంతా అనుకోని ప్రమాదమంటూ మీడియా కూడా తొక్కిపట్టింది. ఇప్పుడు వైసీపీ సర్కారు దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దీనిపై విచారణ కమిటీ వేస్తామంటూ చెప్పారు. బాధ్యులకు శిక్షపడేలా చేస్తామంటూ స్పష్టంచేశారు. ఇదంతా బోయపాటి దర్శకత్వ ప్రతిభతో చోటుచేసుకున్న ప్రమాదమంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబును హైలెట్ చేయాలని.. అమాయకులు ప్రాణాలు బలితీసుకున్నా డంటున్నారు. నేతల స్పీడు చూస్తుంటే.. దీన్ని ఊరకే వదలరని మాత్రం అర్దమవుతోందంటున్నాయి టీడీపీ వర్గాలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa