ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ అర్జున్ రెడ్డి తన రెమ్యూనరేషన్ ని పెంచేసాడా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 05:49 PM

తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కించారు. షాహిద్ కపూర్ ఈ సినిమాలో కథానాయకుడిగా చేశాడు. ఇటీవలే ఈ సినిమా అక్కడ విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో 130 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ కి చేరువలో వుంది.

ఈ నేపథ్యంలో తెలుగులో విజయాన్ని సొంతం చేసుకున్న 'జెర్సీ' సినిమాను కూడా హిందీలో తీయడానికి నిర్మాతలు రంగంలోకి దిగారు. హిందీ రీమేక్ రైట్స్ ను 30 కోట్లకి దక్కించుకున్న నిర్మాతలు, షాహిద్ కపూర్ ను సంప్రదించారట. ఈ సినిమా చేయడానికిగాను ఆయన 40 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టుగా సమాచారం. 'కబీర్ సింగ్' హిట్ తో ఆయన ఒక రేంజ్ లో పారితోషికం పెంచేయడంతో ఆలోచనలో పడిన నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa