వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం 'టుక్ టుక్'. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని, ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. మంగళవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.ఈ సందర్భంగా శాన్వీ మేఘన మాట్లాడుతూ '' పుష్పక విమానం తరువాత నేను చేసిన ఆటో ఎంటర్‌టైనర్ టుక్ టుక్. టీజర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో సూపర్ నేచురల్, మ్యాజికల్ పవర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న చాలా సర్‌ఫ్రైజెస్ ఎంజాయ్ చేయడానికి అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలి'' అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa