ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోపీచంద్‌ నూతన చిత్రం ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:31 AM

హీరో గోపీచంద్‌ కొత్త చిత్రం షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ఘాజీ’, ‘ఐబీ 71’, ‘అంతరిక్షం’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన సంకల్ప్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఏడవ శతాబ్దం నేపథ్యంగా రూపుదిద్దుకునే ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన, ఇంకా అన్వేషించని చారిత్రక సంఘటనను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామనీ, ఇందులో గోపీచంద్‌ ఇంతవరకూ పోషించని ఓ అద్భుతమైన పాత్ర చేస్తున్నారనీ దర్శకుడు సంకల్పరెడ్డి చెప్పారు. విజువల్‌ వండర్‌గా, భారీ స్థాయిలో రూపుదిద్దుకొనే ఈ చారిత్రక చిత్రానికి టాప్‌ టెక్నిషియన్లు పని చేస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీనీ, చిన్నా ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ను, పృథ్వీ యాక్షన్‌ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సురేశ్‌బాబు, ప్రకాశ్‌ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa