ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత సినిమాపై నిషేధం విధించిన హైకోర్టు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2019, 08:43 PM

హిట్ల హీరోయిన్ సమంత నటించిన చిత్రం కాపీరైట్ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైంది. ఆ చిత్రాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదని, ఈ రూపంలోనూ రికార్డు చేసి అమ్మకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే. బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘బ్యాండ్ బాజా బారాత్'(2010) విజయవంతం కావడంతో దాన్ని తమిళం, తెలుగులోనూ రీమేక్ చేయలని యశ్ రాజ్ ఫిలిమ్స్ భావించింది. అయితే 2013లో దాన్ని శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ సంస్థ ‘జబర్దస్త్’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేసింది. ఈ అనధికార రేమేక్ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా,  సమంత, సిద్దార్థ్ జంటగా నటించారు.  తమకు చెప్పకుండా తమ సినిమాను కాపీ కొట్టారంటూ యశ్ రాజ్ ఫిలిమ్స్ కోర్టుకెక్కింది.  కేసును విచారించిన కోర్టు.. జబర్దస్త్ మక్కికి మక్కీ కాపీ మూవీ అని, కాపీరైట్ ఉల్లంఘన జరిగిందని నిర్ధారిచింది. ఇకపై దాన్ని డీవీడీలు, వీసీడీలు, బ్లూరే డిస్క్స్ ఫార్మాట్లలో మార్కెట్లో అమ్మకూడదని, టీవీల్లోనూ ప్రదర్శించ కూడడదని ఆదేశాలు జారీ చేసింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa