హాలీవుడ్ లకు మన దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ లు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మద్యకాలంలో హాలీవుడ్ లు కూడా మన తెలుగు లకు పోటీగా విడుదలవుతున్నాయి.అంతే కాదు తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు మన హీరోలతో డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన అవైజర్స్ లో థానోస్ పాత్రకు దగ్గుబాటి హీరో రానా వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆతర్వాత వచ్చిన లయన్ కింగ్ లో చాలా మంది తెలుగు ఆర్టిస్ట్ లు వాయిస్ లు ఇచ్చారు. సింబా పాత్రకు నాని, అలాగే టిమోన్ పాత్రకు అలీ, పుంబా పాత్రకు బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక రీసెంట్ గా వచ్చిన ముఫాసా లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.హాలీవుడ్ సంస్థ డిస్నీ నిర్మించిన ముఫాసా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. అయితే ఈ వచ్చి నెలలు గడుస్తున్నా ఓటీటీలోకి మాత్రం రాలేదు. అయితే ఇంగ్లీష్ లో మాత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది ఈ .. అయితే తెలుగు వర్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలోకి రాబోతుంది.ముఫాసా తెలుగు వర్షన్ ను జియో హాట్ స్టార్ అందుబాటులోకి తీసుకురానుంది. మార్చ్ 26నుంచి ఈ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ముఫాసా గతంలో వచ్చిన లయన్ కింగ్ కు ప్రీక్వెల్.. సింబా తండ్రి ముఫాసా ఎలా రాజుగా మారాడు అనే కథతో ఈ ను తెరకెక్కించారు. అలాగే ఈ లో టాకా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ముఫాసా తెలుగులోకి రానుండటంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |