ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌రికొత్త లుక్‌లో అక్ష‌య్ కుమార్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2019, 02:13 PM

బాలీవుడ్ బిజీ యాక్టర్స్‌లో అక్ష‌య్ కుమార్ ఒక‌రు. ఆయ‌న ప్ర‌స్తుతం మిష‌న్ మంగ‌ళ్‌, గుడ్ న్యూస్‌, సూర్య‌వంశీ, ల‌క్ష్మీ బాంబ్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు సాజిద్ న‌డియావాలా నిర్మాణంలో బ‌చ్చ‌న్ పాండే అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫ‌ర్హాద్ సంజీ తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ఇందులో అక్ష‌య్ కుమార్ నుదుటిపై విబూది,మెడలో రుద్రాక్షలు, నల్లని పంచె పెట్టుకొని అయ్య‌ప్ప వేష‌ధార‌ణ‌లో ఉన్నాడు. ఇంక‌ చేతిలో మార్షల్ ఆర్ట్స్ ఆయధమైన నాన్ చాక్ ఉండటం ఆసక్తిని రేపుతోంది. మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంద‌ని తెలుస్తుంది. రౌడీ రాథోర్ చిత్రం మాదిరిగానే ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని బాలీవుడ్ మీడియా చెబుతుంది. గ‌తంలో అక్ష‌య్ కుమార్, ఫ‌ర్హాద్ క‌లిసి కోలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం వీర‌మ్‌ని రీమేక్ చేయాల‌నుకున్నారు. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. కాని బచ్చ‌న్ పాండే చిత్రంతో వీరిరివురు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. 2020 క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఇక అక్ష‌య్ న‌టించిన మిష‌న్ మంగ‌ళ్ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa