ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబరు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్న ‘సంబరాల యేటిగట్టు’

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 12:27 PM

సాయి దుర్గా తేజ్‌, ఐశ్వర్య లక్ష్మీ జంటగా రోహిత్‌ కేపీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. చిందరవందర జుట్టు, బాగా పెరిగిన గెడ్డంతో నల్లని కోటు ధరించిన శ్రీకాంత్‌ లుక్‌ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa