నటుడు సాయికుమార్ కుమరం భీం జాతీయ అవార్డును అందుకున్నారు. ఆదివారం ఆషిఫాబాద్‌లో భారత్ కల్చర్ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, ఓం సాయితేజ ఆర్ట్స్ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశాయి. జ్ఞాపికతో పాటు 50వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో భారత్ కల్చర్ అకాడమీ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి పార్థసారధి, మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్, ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa