ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జన నాయగన్‌’ విడుదల తేదీ ప్రకటించిన టీం

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 12:43 PM

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ నటుడు విజయ్‌ చిత్రం ‘జన నాయగన్‌’ విడుదల తేదీ వచ్చేసింది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. కేవీఎన్‌ సంస్థ నిర్మిస్తోంది. మమితా బైజు, బాబీ డియోల్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్‌ ఆఖరి చిత్రం ఇదేనంటూ కోలీవుడ్‌లో కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్‌కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ ఒక పాటను సినిమాలో రూపొందించినట్లు సమాచారం. దర్శకులు లోకేశ్‌ కనగరాజ్‌, అట్లీ, నెల్సన్‌ దిలీ్‌పతో పాటు ఓ హీరో అతిథి పాత్రలో సందడి చేయనున్నారని కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa