ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్‌ 14న విడుదలకి సిద్దమౌతున్న ‘అభినవ్‌’

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 12:51 PM

‘ఆదిత్య’, ‘విక్కీస్‌ డ్రీమ్‌’, ‘డాక్టర్‌ గౌతమ్‌’ వంటి బాలల చిత్రాలు నిర్మించి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన దర్శకనిర్మాత భీమగాని సుధాకర్‌ గౌడ్‌ రూపొందించిన మరో బాలల చిత్రం ‘అభినవ్‌’. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ ‘డ్రగ్‌ మాఫియా విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య స్పూర్తితో అభినవ్‌ అనే బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడన్నది ఈ చిత్ర కథ.’ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డగ్స్‌ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు ఓ చిన్న వీడియో చేయాలని కోరారనీ, తన వంతుగా ఈ సినిమాను తీశాననీ ఆయన తెలిపారు. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్‌ గగన్‌,గీతా గోవింధ్‌, అభినవ్‌, చరణ్‌, బేబి అక్షర తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa