ప్రముఖ దర్శకుడు, నటుడు భారతిరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తనయుడు, నటుడు మనోజ్ భారతిరాజా (48) మృతి చెందారు. భారతిరాజా ఇంట్లో విషాదం. పూర్తి వివరాల్లోకి వెళితే మంగళవారం (మార్చి 25) ఉదయం సమయంలో మనోజ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ విషయం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు మనోజ్ ని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో మనోజ్ వెంటిలేటర్ పై కన్ను మూసినట్లు సమాచారం.. మనోజ్ మరణ వార్తని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేశారు.. దీంతో అభిమానులు, సినీ సెలెబ్రెటీలు భారతీరాజా ఫ్యామిలీ మెంబర్స్ కి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు
![]() |
![]() |