టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. మార్చి 28న సినిమా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23న ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. అయితే, రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్నర్‌పై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ క్రికెటర్‌ను ఉద్దేశించి నటకిరీటి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. ఒక సీనియర్ నటుడు స్టార్ క్రికెటర్‌ను పట్టుకుని ఇలా మాట్లాడటం ఏంటని ఏకిపారేశారు. దీంతో తాను వార్నర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని కోరారు. అయితే, రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వార్నర్‌కు తెలుగు భాష రాకపోవడంతో నవ్వుతూ కనిపించాడు. కానీ, ఇది ఆ తర్వాత అతని వరకు వెళ్లింది. దీనిపై మాజీ క్రికెటర్ ఏమన్నాడో దర్శకుడు వెంకీ కుడుముల తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. "రాజేంద్ర ప్రసాద్, వార్నర్ సినిమా షూటింగ్ సమయంలో చాలా క్లోజ్ అయ్యారు. షూటింగ్ గ్యాప్‌లో ఇద్దరు సరదాగా మాట్లాడుకునేవారు. నువ్వు యాక్టింగ్ లోకి రా చూసుకుందాం అని రాజేంద్రప్రసాద్ అంటే.., నువ్వు క్రికెట్ కి రా చూసుకుందాం అని వార్నర్ సరదాగా సవాల్ కూడా చేసుకునే వాళ్లు. అయితే, ఆ రోజు ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ ఆ పదం అనుకోకుండా మాట్లాడారు. ఈ విషయం గురించి వార్నర్‌కి చెబితే ఏం పర్లేదు అన్నారు. నీకు క్రికెట్ లో స్లెడ్జింగ్ తెలుసా మేము స్లెడ్జింగ్ చేస్తే చెవుల్లోంచి రక్తం వస్తుంది. మా స్లెడ్జింగ్ ముందు ఇదెంత అని వార్నర్ లైట్ తీసుకున్నారు" అంటూ వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు
![]() |
![]() |