ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దేవా' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే..!

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 04:20 PM

ప్రముఖ మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటించిన 'దేవా' అనే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ బాక్స్ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మార్చి 28న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల్ చేసి ప్రకటించింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు రాయ్ కపూర్ ఫిల్మ్స్ నిర్మించాయి. ఇది రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన 2013 మలయాళ చిత్రం ముంబై పోలీస్ యొక్క అధికారిక రీమేక్. ఈ చిత్రం జీ స్టూడియోస్ మరియు రాయ్ కపూర్ ఫిలింస్‌పై నిర్మించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, పావైల్ గులాటి, ప్రవేశ్ రానా మరియు కుబ్రా సాయిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవాకు బాబీ-సంజయ్, హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్, అర్షద్ సయ్యద్ మరియు సుమిత్ అరోరా కథను అందించారు. విశాల్ మిశ్రా సంగీత దర్శకుడు కాగా, జేక్స్ బిజోయ్ బీజీఎం చేశాడు. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీని అందించగా, ఎ శ్రీకర్ ప్రసాద్ మరియు సందీప్ శరద్ రావడే ఎడిటింగ్ నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com