బడ్జెట్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ‘కిృష్-4’ చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. హృతిక్ రోషన్ హీరోగా నటించనున్న ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ మధ్య ఆదిత్య చోప్రా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారనే వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొట్టాయి. అలాంటిదేమీ లేదు ఆయన మాతోనే ఉన్నాడంటూ రాకేశ్ స్పష్టతనిచ్చారు. ‘హృతిక్, ఆదిత్య ఇద్దరూ కలిసి వెండితెరపై ఇదివరకెవ్వరూ చేయలేని ఓ అద్భుతాన్ని ‘కిష్-4’ రూపంలో ఆవిష్కరించనున్నారు’ అంటూ రాకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘దుగ్గు (హృతిక్ రోషన్) పాతికేళ్ల క్రితం నిన్ను ఓ నటుడిగా ఈ ప్రపంచానికి పరిచయం చేశాను. ఇప్పుడు నేను, ఆదిత్య కలసి నిన్ను దర్శకుడిని చేయబోతున్నాం. ఈ కొత్త ప్రయాణంలో అన్నీ విజయాలే చేకూరాలని కోరుతున్నా’ అని రాకేశ్ రోషన్ పేర్కొన్నారు.
![]() |
![]() |