నటి తమన్నా, హీరో విజయ్ వర్మ రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వారి రిలేషన్‌షిప్‌పై పలు రూమర్లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమన్నా, ముంబయిలో జరుగుతున్న ఈవెంట్లో విజయ్ తాజాగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లోనే రిలేషన్షిప్ గురించి మాట్లాడారు. రిలేషన్షిప్లో ప్రతీ విషయాన్ని ఆస్వాదించాలని ఆయన అన్నారు. ఈ రిలేషన్‌షిప్‌ను విజయ్ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్‌తో పోల్చారు. 'రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారా? రిలేషన్‌షిప్‌ను ఓ ఐస్క్రీమ్లాగా ఎంజాయ్ చేసినట్లైతే, మీరు ఆనందంగా ఉంటారు. దాని ఫ్లేవర్ ఏదైనా గానీ, కచ్చితంగా స్వీకరించాల్సిందే' అని విజయ్ పేర్కొన్నారు.అటు తమన్నా కూడా ఇటీవల ఓ సందేశాత్మక పోస్ట్ షేర్ చేశారు. 'జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించాలి' అని తమన్నా అమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ మెసేజ్ షేర్ చేశారు.కాగా, తాజాగా తమన్నా- విజయ్ జంట హోలీ వేడుకల్లో సందడి చేసింది. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ పాల్గొన్నారు. కానీ, వీరిద్దరూ ఈవెంట్‌కు విడివిడిగా వెళ్లారు. దీంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.
![]() |
![]() |