రంజాన్ సందర్భంగా తన ఫ్యాన్స్‌కు ఈద్ ముబారక్ చెప్పారు సల్మాన్ ఖాన్. తన ఇంటి ముందు చాలా మంది అభిమానులు ఉండటంతో.. ఆయన ఇంట్లో నుంచి చేయి ఊపుతూ హాయ్ చెప్పారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి "Shukriya Thank you aur sab ko Eid Mubarak!" అంటూ రాసుకొచ్చారు.లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ కు వార్నింగ్స్ ఇస్తున్నారు.సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
![]() |
![]() |