బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సికందర్' ఆదివారం ఈద్ స్పెషల్‌గా విడుదల అయ్యింది. A.R.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్ డ్రామా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ చిత్రం ప్రారంభ రోజున సుమారు 30 కోట్ల నెట్ ని రాబట్టింది మరియు రెండవ రోజున స్వల్పంగా పెరిగింది. ఈద్ ఫెస్టివల్‌తో సమానంగా రెండవ రోజు 33.36 కోట్ల నెట్ ని వాసులు చేసింది. ఇది తొలి రోజు మీద పోలిస్తే 11% పెరుగుదల. అయినప్పటికీ, సల్మాన్ ఖాన్ కి ఈ సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉంటుంది. ఈ చిత్రం కొన్ని ప్రాంతాలలో బాక్సాఫీస్ వద్ద రెండవ రోజు ఘనతను చూపిస్తుండగా కొన్ని చోట్ల డల్ గా నడుస్తుంది. మంగళవారం ఒక కీలకమైన రోజు అవుతుంది. రష్మిక మాండన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించారు, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ మరియు ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. సాజిద్ నాడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రంలో ప్రీతం సంగీతం మరియు సంతోష్ నారాయణన్ స్కోరు ఉన్నాయి.
![]() |
![]() |