బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ 'రైడ్ 2' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మరొక థ్రిల్లింగ్ రైడ్‌గా ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మే 1, 2025న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ మూవీపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వాణి కపూర్ మరియు రజత్ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐఆర్‌ఎస్ అమయ్ పట్నాయక్ పాత్రను అజయ్ దేవగన్ పోషించిన 'రైడ్' మొదటి భాగం భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 1980లలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీస్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడుల ఆధారంగా రూపొందించబడింది. 'రైడ్ 2'తో, అజయ్ దేవగన్ IRS అమయ్ పట్నాయక్ పాత్రలో మళ్లీ నటించబోతున్నాడు, ఇది ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ రైడ్‌ని అందిస్తుంది.
![]() |
![]() |