ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కేసరి చాప్టర్-2’ ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 03:50 PM

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కేసరి చాప్టర్-2’. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహిస్తుండగా మాధవన్, అనన్యపాండేలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మాధవన్, అక్షయ్‌ల మధ్య జరిగిన సన్నివేశాలు, డైలాగ్‌లు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబ‌ృందం విడుదల చేసింది. కాగా, ఏప్రిల్ 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘ‌ట‌న‌ల‌లో జలియన్ వాలాబాగ్ ఉదాంతం ఒక‌టి. బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఉదాంతం జ‌రిగిన త‌ర్వాత ప‌రిణ‌మాల‌కు సంబంధించి ఈ సినిమా రాబోతున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa