విద్యాబాలన్ త్వరలో వెండితెరపై శకుంతల దేవిగా కనిపించబోతుంది. అదీ మహాభారతంలో శకుంతల కాదు...నేటి భారతంలో మేథమేటిషియన్, సూపర్ హ్యూమన్ కంపూటర్‌గా పేరు పొందిన ప్రముఖ వ్యక్తి శకుంతలదేవిగా విద్యా బాలన్ మెరవనుంది. కంప్యూటర్‌లో నంబర్ ఫజిల్ వేగంగా చేయడంలో ఈ శంకుతల దిట్ట. ఐదేళ్ల ప్రాయంతో 18 ఏళ్ల విద్యార్థి పరిష్కరించే గణితాలను శకుంతల సులుభంగా చేసేవారు. అబుందంతియో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. విక్రమ్ మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. మేథా జీనియస్ నిర్మించనున్నారు. ఇందులో శంకుతల దేవి భర్త పరితోష్ బెనర్జీగా మణికర్ణిలో నటించిన జిస్సు సేతుపతి కనిపించనున్నారు. 1960 బెనర్జీని వివాహం చేసుకున్న శకుంతల 19 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తర్వాత బెనర్జీ రాజకీయాల్లో కూడా వెళ్లారు.
