ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రేండింగ్ లో 'నారీ నారీ నడుమ మురారి' ఫస్ట్ సింగిల్ ప్రోమో

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 04:03 PM

చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 37వ చిత్రాన్ని సమాజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో సంయుక్త మరియు సాక్షి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర బృందం ఈ సినిమా యొక్క మొదటి సింగిల్‌ ప్రోమోని దర్శనమే అనే టైటిల్ తో విడుదల చేసారు. విశాల్ చంద్రశేఖర్ కంపోస్ ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండ ఫుల్ సాంగ్ ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి విశాల్ చంద్రశేఖర్ సౌండ్‌ట్రాక్ అందించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa