బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సికందర్' ఈద్ స్పెషల్‌గా విడుదల అయ్యింది. A.R.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్ డ్రామా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం మే 25న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారిక స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనుంది. రష్మిక మాండన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించారు, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ మరియు ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. సాజిద్ నాడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రంలో ప్రీతం సంగీతం మరియు సంతోష్ నారాయణన్ స్కోరు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa