లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ మరియు రష్మిక మాండన్న ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక నాటకం 'చావా' బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం యొక్క ఒరిజినల్ వెర్షన్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. చాలా మంది, ముఖ్యంగా తెలుగు మాట్లాడే ప్రేక్షకులు నిరాశ చెందారు. తెలుగులో ఈ చిత్రం థియేట్రికల్ విడుదల ఉన్నప్పటికీ నెట్ఫ్లిక్స్ తెలుగు వెర్షన్ను విడుదల చేయలేదు. తెలుగుతో సహా అదనపు భాషా సంస్కరణలను త్వరలో విడుదల చేయనున్నట్లు భావిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా మరియు నీల్ భూపాలం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని దినేష్ విజయన్ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత స్వరకర్త ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని కంపోజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa