బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించిన ఆగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్‌ను ఇంట్లోనే చంపేస్తానని సోమవారం దుండగుడు ఫోన్ చేసి బెదిరించగా ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు గుజరాత్‌లోని వడోదర జిల్లాకు చెందిన 26 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. అతను ఓ మానసిక రోగి అని విచారణలో తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.సోమవారం సల్మాన్‌ను బెదిరిస్తూ వర్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని, లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని అందులోని సారాంశం. ఈ సందేశం గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa