కన్నడ సినిమా యొక్క టాప్ కంపోజర్ అర్జున్ జాన్య దర్శకుడిగా తన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ '45' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 2025లో విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ లాంచ్ ఈవెంట్ ని ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని RK సినీప్లెస్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం మరియు హిందీలలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సూరజ్ ప్రొడక్షన్ విడుదల చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa