'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి రాబోయే చిత్రం 'ఏస్' లో పవర్ ఫుల్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్సె కి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఆరుముగకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం మే 23న విడుదల కానున్నట్లు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. 7CS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆరుముగకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్ నిర్వహిస్తారు మరియు ఆర్ట్ డైరెక్టర్ గా ఎ.కె. ముత్తు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa