విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఏస్’. రుక్మిణి వసంత్ కథానాయిక. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో తుపాకి గురిపెట్టిన లుక్‌లో సేతుపతి ఆకట్టుకున్నారు. సరికొత్త అంశాలతో సాగే వినూత్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది, విజయ్ సేతుపతి పాత్ర కొత్త తరహాలో ఉంటుందని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, సినిమాటోగ్రఫీ: కరణ్ బహదూర్ రావత్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa