ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుడ‌రుమ్’ మూవీ మ‌ల‌యాళంతో పాటు తెలుగులో ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 02:19 PM

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్, దర్శకుడు తరుణ్‌ మూర్తి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘తుడ‌రుమ్’. ఈ మూవీ మ‌ల‌యాళంతో పాటు తెలుగులో ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ చిత్రం తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రం ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఇందులో మోహ‌న్ లాల్ టాక్సీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఇక, ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి శోభ‌న హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మోహ‌న్ లాల్, శోభ‌న కాంబోలో 55 సినిమాలు రాగా.. ఇది 56వ చిత్రం కావ‌డం విశేషం. రెజపుత్ర విజువల్‌ మీడియా సమర్పణలో ఎమ్ రెంజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa