కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ స్పందించారు. ఈ ఉగ్ర ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇది చాలా బాధకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చెర్రీ పోస్ట్ పెట్టారు. "పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధించింది. ఇటువంటి సంఘటనలకు మన సమాజంలో చోటు లేదు. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని నిలబడే మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దేవుడు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను" అని చరణ్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa