లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు నవీన్ చంద్ర ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రానికి "ఎలెవెన్" అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం మే 16, 2025లో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా అభిరామి, శశాంక్, దిలీపన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మించింది. AR ఎంటర్‌టైన్‌మెంట్ వారి విమర్శకుల ప్రశంసలు పొందిన "సిల నెరంగలిల్ సిల మణిధర్‌గళ్" మరియు "సెంబి" చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. వారి మూడవ నిర్మాణ వెంచర్‌గా "ఎలెవెన్"ని అందజేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa