ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ సరసన 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 04:24 PM

పాన్-ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా హర్రర్ థ్రిల్లర్ 'రాజా సాబ్‌' లో పనిచేస్తున్నారు. అంతేకాకుండా నటుడి పైప్ లైన్ లో కన్నప్ప, ఫౌజి, స్పిరిట్, సాలార్ 2, మరియు కల్కి 2 ఉన్నాయి. నిర్మాణంలో వివిధ దశలలో ఉన్న పైన పేర్కొన్న సినిమాలు కాకుండా ప్రభాస్ దేశవ్యాప్తంగా పలువురు చిత్రనిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. హను-మ్యాన్ డైరెక్టర్ ప్రసాంత్ వర్మ వారిలో ఒకరు. ఈ చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 'బ్రహ్మరాక్షస్' అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ప్రభాస్ హైదరాబాద్‌లో ఈ చిత్రానికి లుక్ టెస్ట్ చేయించుకున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, భగ్యాశ్రీ బోర్సే ఈ ఎంటర్టైనర్లో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్టును కెజిఎఫ్ ఫ్రాంచైజ్ మరియు సాలార్ వంటి బ్లాక్ బస్టర్స్ వెనుక ఉన్న కన్నడ ప్రొడక్షన్ హౌస్ అయిన హోంబేల్ ఫిల్మ్స్ బ్యాంక్రోల్ చేయనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa