ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'STR49' అప్డేట్ రివీల్ కి టైమ్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 04:08 PM

ప్రముఖ కోలీవుడ్ నటుడు సిలంబరసన్ (శింబు) జూన్ 5, 2025న విడుదల కానున్న 'తగ్ లైఫ్' లో కనిపించన్నారు. ఈ చిత్రంలో నటుడు కమల్ హస్సన్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నాడు.ఇటీవలే శింబు తన తదుపరి చిత్రాన్ని రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలోప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. STR49 అని పిలువబడే ఈ చిత్రం అభిమానులలో గణనీయమైన ఆసక్తిని సృష్టిస్తోంది. తాజాగా మేకర్స్ ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి కాయదు లోహర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ హాస్య నటుడు సంతానం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సాయి అభ్యంకార్ ఈ సినిమాకి  సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ పై నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa