మెగాస్టార్ చిరంజీవి, సురేఖలపై మెగా కోడలు,రామ్ చరణ్ భార్య ఉపసన ప్రశంసలు కురిపించారు. వృత్తిపరంగా ఎంతో ప్రోత్సాహం ఇచ్చే ఇలాంటి అత్తామామలు ఉండటం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది. నా బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్లే అంటూ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా వాళ్ల ఇద్దరి ఫొటోలను కూడా షేర్ చేశారు ఉపాసన.
ఉపాసన బీ పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు సంపాదకురాలుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాగజైన్‌లో మామ చిరు ఇంటర్వ్యూ, కవర్ పేజీపై చిరు యంగ్ లుక్ ఫొటోను కూడా వేశారు. ఆ మ్యాగజైన్ చదువుతుండగా.. అత్త సురేఖ హెల్త్ కిట్ ప్రొడక్ట్స్ చెక్ చేస్తోంది. ఈ టైంలో ఫొటోలు తీసి వీళ్లే నా బ్రాండ్ అంబాసిడర్లు, ఎంతో స్పూర్తిగా నిలిచే అత్తామామలు నాకు దొరకడం గర్వంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa