శర్వానంద్ హీరోగా ,కాజల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయిక లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న 'రణరంగం' సౌండ్ కట్ ట్రైలర్‌ను కథానాయకుడు రామ్ చరణ్ విడుదల చేశారు.
కాగా ఈ సినిమా సౌండ్ కట్ ట్రైలర్‌ను చెర్రీ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సౌండ్ కట్ అద్భుతంగా. చాలా కొత్తగా ఉంది. మొన్న విడుదలైన ట్రైలర్ కూడా నాకు నచ్చింది. మేం శర్వాను ఎలా చూడాలనుకున్నామో అలానే ఉన్నాడు. శర్వా నటించిన 'కో అంటే కోటి' నాకు ఇష్టం. ఆ చిత్రంలో అతడిలోని తీవ్రత నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మళ్లీ అదే తీవ్రతతో ఈ సినిమాలో నటించాడు. సుధీర్ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రశాంత్ పిళ్లై కూడా సూపర్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. మొత్తం చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa