ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రేండింగ్ లో 'KJQ' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 07:07 PM

బ్లాక్ బస్టర్ 'దసారా' తో సూపర్ హిట్ అందుకున్న కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి తెలుగులో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ 'KJQ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి రాజు, శశి ఒడెలా జాకీగా, యుక్తి థారెజా రాణిగా కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల అయ్యింది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. యుక్తి థారెజా ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి చిత్రనిర్మాత కె.కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ డ్రామా 90వ దశకంలో సెట్ చేయబడింది. పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని కంపోజ్ చేస్తుండగా, నాగేష్ బానెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కర్తికా శ్రీనివాస్.ఆర్ ఎడిటర్ గా, శ్రీకాంత్ రామిషెట్టి ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు. సుధాకర్ చెరుకురి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa