తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఇంటికి రావడాన్ని ‘కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా ఉంది’ అని ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. ఆదివారం కేసీఆర్ తన ఇంటికి వచ్చిన సందర్భంగా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ అభిమానిగాతనను కలిసేందుకు కేసీఆర్ వచ్చారని, తన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఇది కేవలం
మర్యాదపూర్వ భేటీ మాత్రమే, దీనికి రాజకీయ ప్రాధాన్యం అంటగట్టవద్దని కోరారు. లేదని.. ఓ మూమూలు వ్యక్తిగా, కలిశారని చెప్పారు. మాట్లాడారు. తన ఆరోగ్యం బాగుందన్నారు. అజ్ఞాత అభిమానిని అంటూ కేసీఆర్ పేర్కొనడాన్ని గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. తన సినిమాలోని ఓ పాట నచ్చి నన్ను కలుస్తానని కేసీఆర్ రాత్రి ఫోన్ చేసి మాట్లాడారన్నారు. తమ మధ్య సాహిత్య అంశాలపైనా చర్చ జరిగిందని, కేసీఆర్ ఆయా విషయాలపై కూలంకషంగా మాట్లాడుతుంటే అతనిలో ఇన్ని కోణాలు ఉన్నాయా ? అద్భుతమని అనిపించిందని, ఆయన మాటలు మైమరపించాయన్నారు.
మాతో మరు దర్శకత్వం చేపట్టి
సినిమా తీయాలని అభిమానుల కోరికగా కేసీఆర్ చెప్పినా, తనకు ఓపిక లేదని, ఇకపై తాను సినిమాలు తీయనని సీఎం కు తెలిపానని విశ్వనాధ్ చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యానికి ఢోకా లేదని, తన పనులు తను చేసుకొంటున్నట్టు ఆయన ఓ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు.