టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చివరిగా 'ఫ్యామిలీ స్టార్' లో కనిపించరు. ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. నటుడు ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గౌతమ్ టిన్నురి దర్శకత్వంలో నటుడు ఇటీవలే ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాకి 'కింగ్‌డమ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి గౌతమ్ కథ అందించారు. ఈ చిత్రం మే 30, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని హృదయం లోపల అనే టైటిల్ తో విడుదల చేసారు. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ ఫుల్ సాంగ్ ఈరోజు విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో విడుదలైన 24 గంటలలో 15 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. టాలీవుడ్ నటుడు సత్య దేవ్ మరియు నవ్య స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa