ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన 'తమ్ముడు'

cinema |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 11:07 AM

రాబిన్హుడ్ పరాజయం తరువాత, టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ దర్శకుడు శ్రీరామ్ వేణులతో ఒక ఎంటర్‌టైనర్‌ ని ప్రకటించిన సంగతి నాదరికి తెలిసిందే. 'తమ్ముడు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం జూలై 4, 2025న విడుదల కానున్నట్లు పోస్టర్ ని విడుదల చేసి వెల్లడించారు. పూర్తి స్థాయి ప్రమోషన్లు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ తమ్ముడు సినిమాతో టాలీవుడ్‌లో లీడ్ రోల్‌లో నటిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. తమ్ముడు సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్, మ్యూజిక్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ మరియు ఎడిటర్ ప్రవీణ్ పూడితో సహా ప్రతిభావంతులైన సాంకేతిక బృందాన్ని కలిగి ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. సీనియర్ నటి లయా ఈ చిత్రంలో నితిన్ సోదరిగా నటిస్తున్నారు, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa